పుష్కరాల ప్రమాదానికి మీడియా 

Media for the risk of push

Media for the risk of push

Date:19/08/2018
విజయవాడ ముచ్చట్లు:
గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఓ కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం శాసనసభ ముందుంచింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహూర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమేనని కమిటీ తేల్చింది.
ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2015, జులై 14న గోదావరి పుష్కరాల తొలిరోజున పుష్కరస్నానం కోసం లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు ఒక్కసారిగా కదలడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవై సోమయాజులు నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష సాక్షులు, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. పుష్కరాల తొలిరోజు ఉదయం 6.26 గంటలకు స్నానం చేస్తే మంచిదంటూ విస్తృత ప్రచారం చేయడమే ఈ ఘటనకు కారణమని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రచారంతోనే వేలాదిగా తెల్లవారుజామునే పుష్కరఘాట్‌కు చేరుకున్నారని.
బారికేడ్లను తోసుకుంటా ఒక్కసారిగా నదిలో దిగేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని నివేదికలో స్పష్టం చేసింది. ముహూర్త కాలంపై మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రవచన కర్తలు చేసిన దుష్ప్రచారమే ఈ ఘటనకు కారణమని వెల్లడించింది. ప్రజలను గుడ్డిగా నమ్మించడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని.
అందువల్లే 27 మంది చనిపోయారని కమిటీ తెలిపింది. ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఒక్కసారిగా భక్తులు తోసుకొచ్చి ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన అఫిడవిట్‌ను జతచేస్తూ 17పేజీల నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కమిటీ అందజేసింది.
Tags:Media for the risk of push

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *