గొర్రెలకు మేకలకు వైద్య శిబిరం

రామడుగు ముచ్చట్లు:

రామడుగు గ్రామంలో గొర్రెలకు మేకలకు వైద్య శిబిరం నిర్వహించారు. వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు వచ్చు వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలని తగు జాగ్రత్తలు గురించి అనారోగ్యంతో ఉన్న జీవాలకు మందులను పంపిణీ చేశారు. ఉచితంగా గొర్రెలకు మేకలకు టీకాలు వేయడంతో పాటుగా ఈ నీలి నాలుకల టీకాల కార్యక్రమంలో మొత్తం 760 గొర్రెలకు టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ మండల అధ్యక్షులు శ్రీమతి కలిగేటి కవిత లక్ష్మణ్, వైస్ ఎంపీపీ పూరేళ్ళ గోపాల్ గౌడ్, రామడుగు గ్రామ సర్పంచ్ శ్రీమతి పంజాల ప్రమీల జగన్ మోహన్ గౌడ్, వార్డ్ మెంబర్ సముద్రాల శ్రీను, మండల గొర్రెలు మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షులు గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు కడారి రాయుడు, మాజీ ఉపసర్పంచ్ బీరయ్య, రామడుగు మండల పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ గుండి వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ నలువాల గిరిధర్, వెటర్నరీ అసిస్టెంట్ శంకర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Medical camp for sheep and goats

Leave A Reply

Your email address will not be published.