Medical camp on Republic Day

గణతంత్ర దినోత్సవ సందర్భంగా వైద్యశిబిరం

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటిలో లయన్స్క్లబ్‌, సరళ నర్శింగ్‌హ్గమ్‌ వారు సంయుక్తంగా ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్లు శివ, సరళ కలసి మున్సిపల్‌ కార్మికులకు, ఉద్యోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి , మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు వైద్యశిబిరాన్ని లయన్స్క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి , మాజీ కౌన్సిలర్లు అమ్ము, త్యాగరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్దర్‌ పాల్గొన్నారు.

వాడవాడల వైభవంగా గణతంత్ర వేడుకలు

Tags: Medical camp on Republic Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *