Natyam ad

వైద్య శిబిరం విజయవంతం-శిబిరాన్ని వినియోగించుకున్న 300 మంది

శ్రీకాళహస్తి ముచ్చట్లు:


పట్టణంలోని వీయంపల్లిలో ఆదివారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్, ఎంజీఎం హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. సుమారు 300 మంది శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఎంజీఎం వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సూత్రాలు, సలహాలు, సూచనలు అందజేశారు. ఎంజీఎం సంస్థల డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సహకారంతో శ్రీకాళహస్తి, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యమందించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సైతం ప్రెస్ క్లబ్ కోరిక మేరకు ఎన్ని వైద్య శిబిరాలు చేపట్టేదానికైనా తాము సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. పేదలకు సైతం అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే తమ అంతిమ లక్ష్యమన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సంక్షేమానికే కాకుండా ప్రజాక్షేమం కోసం కూడా పాటుపడుతుందని సీనియర్ పాత్రికేయులు రహమతుల్లా, వలిపి శ్రీరాములు, వీసీ వెంకటయ్య, వి.రవి, శీను అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఒకటో వార్డు వైసీపీ ఇంచార్జి పసల సురేష్, ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పసల సుమతి, పసల రమణయ్య, రామచంద్రయ్య, కమలాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కామేష్, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, పీఆర్వో మెహర్, ఎంజీఎం వైద్యులు వివేక్ చైతన్య, తేజస్విని, శివకిషోర్, ఉమామహేశ్వర్ రావు, సిబ్బంది మధు, చైతన్య, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

 

Tags: Medical camp was a success – 300 people benefited from the camp

Post Midle
Post Midle