మెడికల్ కళాశాల సాధనకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి టిజివో కు వినతిపత్రం

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల ను కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని కోరుతూ, శుక్రవారం  విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సాయి రెడ్డి, ఖయ్యుంలకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  2018 ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల తో పాటు నూతన విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని కెసిఆర్ మాట ఇచ్చారని ఈ వారంలో కేసీఆర్ పర్యటన కామారెడ్డి లో ఉందని , ఆ పర్యటన లోపే నూతన విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యాసంస్థల సాధనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను మరియు ప్రజా సంఘాలను,అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాలను అందజేసి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, భరత్ , కుంభాల లక్ష్మణ్ యాదవ్ లు పాల్గొనడం జరిగింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Medical community achievement should be supported by all communities
Petition to Tijivo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *