పుంగనూరులో హస్టల్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని దోబీకాలనీలో ఉండు ఎస్సీ, బీసీ హాస్టల్‌లోని పేద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ హాస్టల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించి, విద్యార్థులకు చట్టం, న్యాయం పట్ల అవగాహన కల్పించారు. అలాగే హాస్టల్‌ విద్యార్థులందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించి, వైద్యసేవలు అందించి, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Medical examination for hostel students in Punganur

Leave A Reply

Your email address will not be published.