Natyam ad

356 మందికి వైద్య పరీక్షలు

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణంలో సోమవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 356 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం తోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకొని అమలుచేస్తున్నారన్నారు. అనంతరం కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఐసీడీఎస్‌శాఖ ్యధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్స్ను పరిశీలించి ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య పరీక్షల అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వరుణ్‌భరత్‌, మండల పార్టీ కన్వీనర్‌ అంజిబాబు, సచివాలయ మండల కన్వీనర్‌ రుక్మిణమ్మ,వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌,ఎంపీటీసీ శ్రీరాములు, పీహెచ్‌సీ కమిటీ చైర్మన్‌కళ్యాణ్‌, ఉపసర్పంచ్‌ అల్తాఫ్‌, ఎంపీడీఓ సుధాకర్‌, తహశీల్దార్‌, పంచాయతీ ఈఓ సుధాకర్‌ రావు,ఐసీడిఎస్‌ సూపర్‌వైజర్లు రమాదేవి తదితరులున్నారు.

 

Post Midle

Tags; Medical examinations for 356 people

Post Midle