వ్యాక్సినేషన్ సెంటర్లను తనిఖీ చేసిన మెడికల్ ఆఫీసర్

తుగ్గలి ముచ్చట్లు:

మండల కేంద్రమైన తుగ్గలిలోని వ్యాక్సినేషన్ సెంటర్లను తుగ్గలి ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.గురువారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని గ్రామ సచివాలయంను,వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలను తెలియజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం అందించే వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు నమ్మకుండా 45 సంవత్సరాలు పైబడిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ను స్వీకరించాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి విఆర్ఓ నాగేంద్ర,ఏఎన్ఎం దానమ్మ,అంగన్వాడీ కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు,ఆరోగ్య మిత్ర ఖాసీం మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Medical Officer inspecting vaccination centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *