సబ్ సెంటర్ పై విచారణ చేపట్టిన మెడికల్ ఆఫీసర్

Date:17/10/2019

తుగ్గలి  ముచ్చట్లు:

సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు అనే వార్త పై తుగ్గలి ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ పెండేకల్లు ఆర్ఎస్ గ్రామంలో విచారణ చేపట్టారు.పెండేకల్లు ఆర్ఎస్ సబ్ సెంటర్ గురించి సిపిఐ నాయకుడు పీరా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మెడికల్ ఆఫీసర్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా సబ్ సెంటర్ పూర్తిగా శిథిలావస్థకు చేరిందని,అందువలన ఏఎన్ఎం సబ్ సెంటర్ ను బాడుగకు  తీసుకొని విధులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు.ఏఎన్ఎం ప్రతిరోజు గ్రామంలో తిరుగుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. ఏఎన్ఎం తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన వ్యక్తుల పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్,బసిరెడ్డి,గోపాల్ రెడ్డి, దివాకర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

Tags: Medical Officer who investigated the Sub Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *