Natyam ad

17 నుండి శ్రీ సత్య సాయి సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు బంద్.

పుట్టపర్తి ముచ్చట్లు:
 
పుట్టపర్తి లో కోవిద్ ఉద్ధృతి నేపథ్యంలో… వైద్యం కొరకు ఇతర రాష్ట్రాల నుండి హాస్పిటల్ కు వచ్చే రోగులకు.. తాత్కాలికంగా.. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇతర రాష్ట్రాల నుండి పుట్టపర్తికి వస్తున్న వారికి … అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవడంతో.. నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు.. సుదూర ప్రాంతాల వాసులకు వైద్య సేవలు లభించవు. అయితే పుట్టపర్తి పరిసర వాసులకు మినహాయింపు ఇచ్చారు. కోవిద్ టెస్ట్ రిపోర్ట్ తో.. స్థానిక మండల ప్రజలు, సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు వినియోగించుకోవచ్చు. గడిచిన రెండు రోజుల్లో పట్టణంలో 100 కు పైగా కేసులు నమోదు అవ్వడం కలవరపెడుతోంది.మరోవైపు పట్టణంలో మాస్కులు లేని వారిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పెనాల్టీ విధించారు.ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారులు సూచిం చారు. అవసరమైతే తప్ప జనావాస ప్రాంతంలో సంచరించ రాదని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Medical services at Sri Sathya Sai Super Hospital will be closed from 17th.

Leave A Reply

Your email address will not be published.