అందుబాటులో వైద్య సేవలు-డీసిహెచ్‌ఎస్‌ ప్రభావతి

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు ఉండాలని , సిబ్బంది ప్రతి రోజు గ్రామాలను సందర్శించాలని డిసిహెచ్‌ఎస్‌ ప్రభావతి డాక్టర్లను, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆమె ఆర్‌సిహెచ్‌ రాంమోహన్‌తో కలసి పట్టణంలోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్లు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వర్షాలు తీవ్రంగా ఉన్న కారణంగా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఎప్పటికప్పుడు చికిత్సలు అందించి, టీకాలు వేయాలన్నారు. వర్షాకాలంలో నీరు కలుషితం కాకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు నిల్వ లేకుండ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు టీకాలు, మందులు వేసి, ప్రజల ఆరోగ్యానికి పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్లు సల్మాబేగం, తేజశ్రీ, రంజితతో పాటు సూపర్‌వైజర్లు మురళిబాబు, హరిప్రసాద్‌రెడ్డి, సరస్వతి, ఆనంద, దేవప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: Medical Services Available – DCHS Prabhavati

Post Midle