Natyam ad

పుంగనూరు రోటరీక్లబ్‌చే 75 మందికి వైద్య సేవలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని శంకర్‌ ఐ ఆసుపత్రి వారు నిర్వహించారు. ఈ శిబిరంలో 75 మందికి వైద్యులు షిఫా,భవాని, రమ్య, యోషిక, దీపిక, కోఆర్డినేటర్‌ నాగరాజు ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేసి , 27 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు సెకట్రరీ రాజారెడ్డి తెలిపారు. ఆపరేషన్లకు వెళ్లే వారిని ఉచితంగా తీసుకెళ్లి అన్ని సదుపాయాలు కల్పించి , శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు అనిల్‌కుమార్‌, డాక్టర్‌ శరణ్‌, త్యాగరాజు, భాస్కర్‌జెట్టి, గణేష్‌, భాస్కర్‌, హరిప్రసాద్‌, వేణుగోపాల్‌, మునిరాజ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Medical services for 75 people by Punganur Rotary Club

Post Midle