Natyam ad

పుంగనూరులో వైద్యసేవలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలో విలేజ్‌ క్లీనిక్‌ ట్రయల్‌రన్‌ చురుగ్గా సాగుతోంది. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సృజన, 104 మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సిందు ఆధ్వర్యంలో మంగళవారం ఏతూరు గ్రామంలో వైద్యసేవలు నిర్వహించారు. ఇందులో 36 మందికి చికిత్సలు నిర్వహించారు. 22 మంది చక్కెరవ్యాది గ్రస్తులకు , 22 మంది  బీపీ కలిగిన వారికి కూడ చికిత్సలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక ప్రతిభావంతుల ఇండ్లకు వెళ్లి చికిత్సలు నిర్వహించారు. డాక్టర్‌ స్రృజన మాట్లాడుతూ ట్రయల్‌రన్‌ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం శకుంతల, ఎంఎల్‌హెచ్‌పి సౌందర్య, ఎంపీహెచ్‌ఏ సోమశేఖరాచారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Medical Services in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.