పుంగనూరులోని గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందించడం ఎంతో అవసరమని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మదనపల్లెకు చెందిన రమనేత్రాలయ ఆసుపత్రి వారు ఏతూరు సచివాలయంలో కంటి వైద్యశిభిరం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని రకాల వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కూడ వైద్యసేవలు అందించేందుకు ముందుకురావడం శుభపరిణామమన్నారు. ఆపరేషన్లు అవసరమైన రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి శిభిరాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కొత్తపల్లె చెంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ శివకుమార్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; Medical services in rural areas of Punganur – MPP Bhaskar Reddy
