Natyam ad

అత్యున్నత ప్రామాణాలతో  వైద్య సేవలు అందించాలి…

*జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు…
జేసీ సాయికాంత్ వర్మతో కలిసి రిమ్స్ జిజిహెచ్ వైద్య సిబ్బందితో సమీక్ష ..

కడప ముచ్చట్లు:

 

వైద్య సేవల్లో అత్యున్నత ప్రామాణాలతో రిమ్స్ జిజిహెచ్ ను ఆదర్శవంతంగా  తీర్చిదిద్దాలని.. అందుకు అనుగుణంగా వైద్యులు, పరిపాలన యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.
శుక్రవారం రిమ్స్ వైద్యకళాశాల సమావేశ మందిరంలో  జరిగిన సమీక్షా సమావేశానికి.. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సీఎం సాయికాంత్ వర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజలకు అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా.. గుర్తింపు పొందుతోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన వైద్యసేవలతో.. వేలాది మంది ప్రజలకు ప్రతి నిత్యం ప్రాణ రక్షణ కల్పిస్తున్న రిమ్స్ జిజిహెచ్ ఆసుపత్రిని.. మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఉందన్నారు.

 

 

 

Post Midle

వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ డ్యూటీల కేటాయింపులో.. ఒక నెల ముందే రోస్టర్ లిస్టును సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రక్రియ ప్రతినెలా విధిగా, నిరంతరాయంగా కొనసాగాలన్నారు. జూలై మాసం నుండి అన్ని విబాగాల్లో వైద్య సిబ్బంది 100% అటెండెన్స్ ఉండేలాచర్యలుతీసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులను 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. క్యాజువాలిటీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి.. డిపార్టుమెంట్ ల వారీగా ఓపి, ఐపీ, సర్జరీల వివరాలను రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. సిటీ, ఎం.ఆర్.ఐ., ఎక్స్ రే విభాగాల్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ ప్రదేశాలను క్రమబద్దీకరించాలన్నారు. బయటి నుండి వచ్చే ప్రయివేటు అంబులెన్స్, ఇతర వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే ఉండేలా చూడాలన్నారు. శానిటేషన్ ప్రక్రియ నిరంతరాయంగా..

 

 

 

జరగాలని ఆదేశించారు. రిమ్స్ ఆవరణలోని క్యాంటీన్ నిర్వహణ అత్యంత ఆరోగ్యకరంగా, శుచిగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకెళ్లాలన్నారు.భవిష్యత్తులో రిమ్స్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, నేత్ర వైద్యశాల, మానసిక వైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయన్నారు. రాయలసీమలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించే మెడికల్ హబ్ గా కడప రిమ్స్ జిజిహెచ్ ఆసుపత్రి విస్తృత సేవలు అందించనుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్.. రిమ్స్ జిజిహెచ్ లోని అన్ని విభాగాల వైద్యాధిపతులతో సమీక్షించారు. ఆయా విభాగాల్లో అవసరమైన వసతులు, సదుపాయాలు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే.. పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వర్ రావు, రిమ్స్ ప్రిన్సిపాల్ సి.ఎస్.ఎస్. శర్మ, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, డిడి శ్రీనివాసరావు, డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కో. ఆర్డినేటర్ డా.రమేష్, రిమ్స్ ఆర్ఎంఓలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Medical services must be provided to the highest standards …

Post Midle