పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలి

కడప ముచ్చట్లు:

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా అన్నారు. ఆదివారం స్థానిక శంకరాపురం లోని బ్లైండ్ స్కూల్ సమీపంలో మెహతాబ్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా, నగర మేయర్ కే సురేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజల కొరకు అనేక  వైద్య ఆరోగ్య సంక్షేమ  పథకాలను ప్రవేశ పెట్టి అమలు  చేస్తున్నారని వాటిని పేద ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. అలాగే వైద్యులు పేద ప్రజలకు వైద్య సేవలు అందించే స్వభావం కలిగి ఉండాలని వైద్య వృత్తి పూజింప తగ్గ వృత్తి అని అన్నారు.

 

 

మెహతాబ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసిన డాక్టర్ రాజా అహ్మద్ కు అభినందనలు తెలిపారు.నగర మేయర్ కె.సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అందులో ముఖ్యంగా వైద్య ఆరోగ్య సేవలకు పెద్ద పీట వేయడం జరిగిందని ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని అన్నారు. తొలుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా, నగర మేయర్ కే సురేష్ బాబు లు రిబ్బన్ కత్తిరించి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని ఆర్థో, గైనిక్, న్యోరో వివిధ విభాగాలను పరిశీలించి డాక్టర్ రాజా అహ్మద్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో వైసిపి నాయకులు ఆఫ్జల్ ఖాన్, డాక్టర్ వేంపల్లి భాష, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Medical services should be provided to poor people

Leave A Reply

Your email address will not be published.