ప్రభుత్వాసుపత్రిలో అందని ద్రాక్షగా మారిన వైద్య సేవలు

Medical services that do not have a vaccine in the government hospital

Medical services that do not have a vaccine in the government hospital

– పేరుకే 50 పడకల ఆసుపత్రి

Date:07/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

యాబై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులకు వైద్యం అందని ద్రాక్ష పండులా మారింది. పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో సరైన చికిత్సలు, పరీక్షలు చేయకపోవడం, వైద్యులు , సిబ్బంది సకాలంలో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు చేసుకోవాల్సి వస్తోంది. గత నెలలో జ్వరం వచ్చిన బాలుడికి సరైన చికిత్సలు అందించకపోవడంతో ఆబాలుడు మృత్యువాత పడ్డడు. అలాగే గత నాలుగు రోజుల క్రితం పుంగనూరు పట్టణానికి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ తన భర్తకు చాతిలో నొప్పి వస్తోందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయకుండ, మందులు సైతం బయట నుంచి కొనుగోలు చేయించి, మాయమాటలు చెప్పి, సూది వేసి పంపేశారు. బాధితులు చేసేది ఏమి లేక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకున్నారు. ఈ విధంగా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత మంది డాక్టర్లు, కొంత మంది సిబ్బంది నిర్లక్ష్యం పేదరోగుల పాలిట శాపంగా మారుతోంది.

మెప్పుల కోసం….

పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత మంది డాక్టర్లు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుంటు వారి మెప్పుల కోసం ఫ్రోటోకాల్‌ ఉల్లంగించారు. ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఫైరోజ్‌బేగం పనితీరు, ఫ్రోటోకాల్‌ ఉల్లంఘనపై ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రీవిలేజ్‌ కమిటికి గత వారం ఫిర్యాదు చేశారు.

ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి ఫిర్యాదు….

పుంగనూరు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి ప్రతినిధులు చిన్నప్ప, నరసింహులు, శ్రీరాములు, శ్రీనివాసులు తదితరులు గత నాలుగు రోజుల క్రితం తహశీల్ధార్‌ మాధవరాజు కు ఫిర్యాదు చేశారు. దీనిపై తహశీల్ధార్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ తో కలసి మానటరింగ్‌ కమిటి సభ్యులు కలసి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలపై తనిఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు మానటరింగ్‌ కమిటి సభ్యుల దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. దీనిపై నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తహశీల్ధార్‌ విచారణ సమయంలో తెలిపారు. ఇలా ఉండగా రోజురోజుకు కొంత మంది వైద్య సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యంపై రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రాజకీయాల పట్ల చూపుతున్న వెహోగ్గు, వైద్యం పట్ల చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న వెంటనే చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో అందని ద్రాక్షగా మారిన వైద్య సేవలుhttps://www.telugumuchatlu.com/medical-services-that-do-not-have-a-vaccine-in-the-government-hospital/

Tags: Medical services that do not have a vaccine in the government hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *