పల్లె ప్రకృతిలో ఔషధ మొక్కలు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

మర్రిగూడ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉండే వట్టిపల్లి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఒకప్పుడు ఫ్లోరైడ్‌ మహమ్మారికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఈ పంచాయతీలో మిషన్‌ భగీరథతోపాటు అన్ని రకాల ప్రగతి కార్యక్రమాలు భేషుగ్గా అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను ప్రత్యేకత చాటేలా ఏర్పాటు చేశారు.గ్రామంలోని సర్వే నంబర్‌ 3లోని ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అదే సర్వే నంబర్‌లో దానికి అనుసంధానంగా మరో 20గుంటల స్థలంలో ఔషధ మొక్కల హరితవనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండు వనాల చుట్టూ రాతి కడీలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, ఔషధ, నీడనిచ్చే మొక్కలు ఏపుగా ఎదుగుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అదేవిధంగా సర్వే నంబర్‌ 273లో ఏర్పాటు చేసిన వన నర్సరీలో 7వ హరితహారంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

 

 

 

సర్వే నంబర్‌ 4లోని 2 ఎకరాల విశాలమైన స్థలంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. చక్కటి రంగులతో ముఖద్వారాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇందులోని ఖాళీ స్థలంలో మొక్కలు పెంచడంతో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. సర్వే నంబర్‌ 273లో డంపింగ్‌ యార్డును నిర్మించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే గ్రామంలోని ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లను నిర్మించడంతోపాటు ఇంకు డు గుంతలు ఏర్పాటును ప్రోత్సహించారు. దీంతో గ్రామంలో మురుగు నీటి నిల్వకు చెక్‌ పడింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, జడ్పీ నిధుల నుంచి మంజూరైన రూ.39లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామానికి 339 ఇంకుడు గుంతలు మంజూరు కాగా 148 నిర్మించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Medicinal plants in rural nature

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *