Natyam ad

పుంగనూరులో పోలీసులకు మందులు విరాళం

పుంగనూరు ముచ్చట్లు:

పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సరళ నర్శింగ్‌ హోమ్ అధినేత డాక్టర్‌ శివ, లయన్స్ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీరాములు కలసి రూ.25 వేల రూపాయల మందులు విరాళంగా ఇచ్చారు. ఆదివారం సంస్మరణ దినోత్సవ సందర్భంగా చిత్తూరులో నిర్వహిస్తున్న మెగా వైద్యశిబిరానికి మందులను ఎస్‌ఐ మోహన్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల భద్రతలో పోలీసులు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్‌  కార్యదర్శి ఈశ్వరమ్మ, హెడ్‌కానిస్టేబుల్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Medicines donated to police in Punganur

Post Midle