మంత్రి లోకేష్ తో సినీ నిర్మాతల భేటీ

Meet filmmakers with minister Lokesh

Meet filmmakers with minister Lokesh

 Date:13/04/2018
అమరావతి ముచ్చట్లు:
ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయిలకే ఇంటర్నెట్,కేబుల్ టీవీ,టెలీఫోన్ సౌకర్యం కల్పిస్తున్నాం. దీని ద్వారా ఎన్నో అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు మంత్రిని తెలుగు సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, ఠాగూర్ మధు తదితరులు కలిసారు. ఫైబర్ గ్రిడ్ కంటెంట్ అభివృద్ధి లో భాగంగా ఫైబర్ గ్రిడ్ తో సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకుంటున్నారు. మంత్రి మాట్లాడుతూ వినోదం తో పాటు,విద్య, వైద్యం ఇలా అనేక విధాలుగా ప్రజలకు ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలు అందించబోతున్నాం. ఫైబర్ గ్రిడ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచెయ్యడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలు,చిన్న సినిమాలు, వినోద కార్యక్రమాలు,షార్ట్ ఫిల్మ్స్ ఇలా అనేక సేవలు ప్రజలకు అందించే అవకాశం ఉందని అయన అన్నారు. యువత వారి నైపుణ్యాలను ప్రపంచానికి చూపించడానికి ఫైబర్ గ్రిడ్ మంచి వేదిక అవుతుందని అయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హమీనిచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ  ఫైబర్ గ్రిడ్ ద్వారా సినిమాలు,థియేటర్ల లో రిలీజ్ కి నోచుకోని చిన్న సినిమాలు,షార్ట్ ఫిల్మ్స్,కేబుల్ టీవీ లోనే సినిమా టికెట్స్ బుక్ చేసుకునే  అవకాశం లాంటి సేవలు ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు అందించబోతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీ ప్రరిశ్రమ అభివృద్ధి,స్టూడియోల నిర్మాణం,ఫిల్మ్ నగర్ లాంటి వాతావరణం ఏర్పాటు కు పూర్తి స్థాయి ప్రణాళిక తో వస్తామని అన్నారు.
Tags:Meet filmmakers with minister Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *