ఘనంగా జరిగిన కేటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్ సమావేశం
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు లో స్థానికంగా గల రామానాయుడు కళ్యాణ మండపం లో కేటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు,కడప, కర్నూలు, అనంతపురం జిల్లా ల నుండి సభ్యులు హాజరయ్యారు.ఈ సమావేశం లో అధ్యక్షులు వరద రాజులు మాట్లాడుతు కేటరింగ్ రంగాన్ని పరిశ్రమ గా గుర్తించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీ.ఎస్.టి మరియు ఫుడ్ సేఫ్టీ పై సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని,ఆయా జిల్లాలకు త్వరలో కమిటీ లు వేస్తామని,ఈ కరొణ సమయం లో చిన్న తరహా క్యాటరరస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో రవి కుమార్ జనరల్ సెక్రటరీ,రమేష్ బాబు ట్రసరార్, విజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Meeting of the Federation of Caterers Association of Andhra Pradesh