చిత్తూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం
తిరుపతి ముచ్చట్లు:
సెక్రెటరీ (ప్లానింగ్) మరియు సీనియర్ IAS అధికారి, GSRKR విజయకుమార్ …చిత్తూరు మరియు తిరుపతి జిల్లా SC/ST/BC / మైనారిటీ ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, మరియు ప్రజా సంఘాలు , స్వచ్ఛంద సంస్థలతో సావేరి, గెస్ట్ హౌస్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ బాణావతి మునీంద్ర నాయక్ పాల్గొని దళిత, గిరిజన సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగినది, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ పునరుద్దించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫండ్ ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది, భూ పంపిణీ కార్యక్రమంలో దళిత గిరిజనులకు పంపిణీ చేయాలని, ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయాలని కమిషన్ దృష్టికి తీసుకుని పోవడం జరిగినది. నాడు నేడు కార్యక్రమం లాగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో కూడా ఏర్పాటు చేయాలని దృష్టికి తీసుకొని పోవడం జరిగినది.

Tags; Meeting on SC and ST Vigilance Development Programs of Chittoor District
