Meeting with Police, Municipality, Revenue Committee

పోలీసు, మున్సిపాలిటీ , రెవిన్యూ కమిటీ తో సమావేశం

Date:10/08/2020

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు డి ఎస్ పి కె ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు, మున్సిపాలిటీ , రెవిన్యూ అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ తో సమావేశం నిర్వహించడం జరిగింది.ఎక్కడ కూడా విగ్రహాలను బహిరంగ ప్రదేశములలో , రోడ్లమీద ఏర్పాటు చేయరాదు అని ఈసారి కేవలం ఇళ్ళలోనే పండుగ చేసుకోవాలని నిర్ణయం జరిగింది. 21 వ తేదీ లొక్డౌన్ టైం తగ్గించి ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం ఏడు గంటలవరకు షాపులు తెరిచి ఉంచుతారు .ప్రజలు పండుగ సరకులు కొనడానికి వీలు కలిపించారు . అలాగే ఆరోజు చిత్తూరు నగరములో అనేక చోట్ల పండుగ సరుకులు దొరికేలాగ ఏర్పాటు చేస్తారు. చర్చ్ వీధిలో బజారు వీధిలో గాంధీరోడ్డులో వాహనములు అనుమతించరు . సామూహిక నిమజ్జనం ఉండదు .కేవలం వినాయక సాగర్ కాకుండా చిత్తూరు చుట్టూ గల నాలుగు చెరువులలో ఇళ్లలోని విగ్రహాలు వేసుకోవచ్చు. అందరుకూడా 2 అడుగులలోపు చిన్న విగ్రహాలే ఇళ్లలో పూజించాలి .క్రేనులు ఏర్పాటు చేయడం లేదు . ఎవ్వరు కూడా గుంపులు గా ఉండరాదు.

శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు సేవలు చిరస్మరణీయం

Tags: Meeting with Police, Municipality, Revenue Committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *