చేనేత వర్గాలకు అండగా వుండాలి

కడప ముచ్చట్లు:

మన సంప్రదాయ కళలు, వృత్తులను ఆదరిస్తూ చేనేత వర్గాలకు ప్రతి ఒక్కరూ తమవంతుగా అండగా నిలబడాలని కడప మార్కెట్యార్డు డైరెక్టర్ బంగారు నాగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శ్రీ కళాజ్యోతి హస్తకళాకారుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో కడప నగరంలోని  టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేతలు, హస్తకళా రూపాల ప్రదర్శన, అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాధవరం చేనేతలు, శెట్టిగుంట కొయ్యబొమ్మలు, వనిపెంట ఇత్తడి వస్తువులు ఎంతో పేరుగాంచాయన్నారు. ఆయా వస్తు సామాగ్రితోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ హస్తకళా రూపాలను ఈ ప్రదర్శనలో ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.

 

 

క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. నగర వాసులు ప్రదర్శనను ఆయా వస్తు సామాగ్రిని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం ప్రదర్శన మేనేజర్ వెంకయ్య మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన హస్త కళారూపాలను, వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచామని, ఈనెల 17వ తేది వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, చేనేత, హస్త కళాకారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Meetings among Dalits…

Post Midle