దళితవాడల్లో సమావేశాలు

కడప ముచ్చట్లు:

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎస్సీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న పథకాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.బీజేపీ దేశ వ్యాప్తంగా తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితవాడల్లో సమావేశాలు కొనసాగుతుఆన్నయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎస్సీల సమగ్రాభివృద్దికి తగిన చర్యలు చేపడుతూ అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.  ఎస్సీ వర్గాలకు మేలు చేయాలని సంకల్పించి హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చేపట్టిన ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి సమావేశంలో స్వయంగా నరేంద్రమోదీ పాల్గొనడం జరిగిందన్నారు. దళితుల అభివృద్దికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని ఆయా వర్గాలు తెలుసుకోవాలన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ది బీజేపీతోనే సాధ్యమని గుర్తించి ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీకి తన వంతుగా మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా  జిల్లా ఉపాధ్యక్షులు ఆది వెంకటసుబ్బయ్యతోపాటు ఇతర బీజేపీ నాయకులు, దళిత ప్రముఖులు పాల్గొన్నారు.

 

Tags: Meetings among Dalits

Post Midle
Post Midle