11న మెగా రక్తదాన శిబిరం

Mega Blood Donation Camp on 11th

Mega Blood Donation Camp on 11th

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా ఈనెల 11న మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపి ముస్లిం మైనార్టీల నాయకుడు అర్షద్‌అలి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి జన్మదిన సందర్భంగా డాక్టర్‌ సబిహాకౌసర్‌ తో కలసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కౌసర్‌ నర్సింగ్ హోమ్ లో ఉదయం 8 గంటల నుంచి శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరాన్ని మంత్రి సతీమణి స్వర్ణలత , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి , పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వైఎస్సార్సీపి యువజన సంఘ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి కలసి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి పేరిట పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలోప్రతి ఒక్కరు పాల్గొని, రక్తదానం చేసి, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని కోరారు.

ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

Tags: Mega Blood Donation Camp on 11th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *