ఎన్టీ రామారావు 25 వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

Date:18/01/2021

పత్తికొండ  ముచ్చట్లు:

పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా పత్తికొండ పట్టణంలో ని గుత్తి బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నాయకులు బత్తిని వెంకటరాముడు, సాంబశివారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయులు అయినటువంటి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీకి వారు చేసిన కృషిని మరువలేమనీ మరొక్కసారి గుర్తు చేసుకున్నారు.అనంతరం పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మెగా రక్తదాన శిబిరానికి పత్తికొండ, మద్దికేర,తుగ్గలి మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు టిడిపి రాష్ట్ర పార్టీ నాయకులు బత్తిని వెంకట రాముడు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, పత్తికొండ టిడిపి మండల కన్వీనర్ లోకనాథ్, మద్దికెర మండల టిడిపి కన్వీనర్ ధనుంజయ, మద్దికేర మాజీ జెడ్పిటిసి పురుషోత్తం చౌదరి, సురేష్ కుమార్, అశోక్, తదితర నాయకులు పాల్గొన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Mega blood donation camp set up on the occasion of the 25th death anniversary of NT Rama Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *