ఏఎస్పీ సాయి చైతన్య ఆధ్వర్యంలో మెగా రక్తదానం

Date:29/10/2020

ములుగు ముచ్చట్లు:

పోలీసు అమ‌ర‌వీరుల స్మార‌క వారోత్స‌వాల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం రోజున ములుగు డివిజన్ పోలీసులు మెగా ర‌క్త‌దాన శిబిరాన్ని ములుగు ఎఎస్పి సాయి చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి. జిల్లా కలెక్టర్ క్రిష్ణ  ఆదిత్య ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. అన్నదానాలకన్నా రక్తదానం మిన్నా అని రక్తం ఇవ్వడంతో ప్రతి వ్యక్తికి నూతన రక్తం వస్తుందని, దీంతోపాటు మరోమనిషి ప్రాణాలు కాపాడినవారమవుతామని ఆయన పేర్కొన్నారు.పోలీసు అమరుల జ్ఞాపకార్దం నిర్వహించిన ఈ శిబిరం వారికి అభినందించారు. ములుగు ఏ ఎస్ పి సాయి చైతన్య మాట్లాడుతూ
అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తాన్ని ఇవ్వడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటార‌న్నారు.ర‌క్త‌దానం రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడుతుందని, తలసేమియా,మూత్రపిండ సంబంధిత వ్యాధుల రోగులకు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌న్నారు. ర‌క్త‌దానం చేసేందుకు స్వ‌చ్ఛందంగా ముందుకువ‌చ్చిన వారిని అభినందించారు,అనంతరం ఎఎస్పి సాయి చైతన్య  తో పాటు ఎస్సైలు రక్తదానం చేశారు ఈ శిబిరంలో  103 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ ములుగు వారికి అందించారు ఈ కార్యక్రమంలో ములుగు.పస్రా.సిఐలు.కొత్త దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, ములుగు,వెంకటాపూర్,పస్రా, తాడువాయి,ఎస్సైలు,హరికృష్ణ, రమేష్,రవీందర్,వెంకటేశ్వర్లు,రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ప్రసాద్ స్టేట్ ఆర్గనైజర్,లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు చుంచు రమేష్,బోయినపల్లి శ్రీధర్ కార్యదర్శి. ముక్కు సుబ్బారెడ్డి కోశాధికారి, దొంతి రెడ్డి బలరాం రెడ్డి, సానికొమ్ము రవీందర్ రెడ్డి. తోట రమేష్,స్వచ్ఛంద సంస్థలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువకులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కు  కరోనా వారియర్స్ అవార్డ్

Tags: Mega blood donation under the auspices of ASP Sai Chaitanya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *