Date:01/01/2021
ఏలూరు ముచ్చట్లు:
తెలుగు సినిమా తెరపై మెగా ఫ్యామిలీది చెరగని ముద్ర. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు స్వగ్రామం అయిన ఈ మెగా ఫ్యామిలీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు, ప్రజల హృదయాల్లో తమకంటూ చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంది. అయితే అలాంటి మెగా ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్‌కు సొంత ప్రాంత వాసులు పొలిటికల్‌గా పట్టం కట్టకపోగా చిత్తుగా ఓడించారు. ఇది మాత్రం ఆ కుటుంబానికి పెద్ద మాయని మచ్చ లాంటిదే. వెండితెర రారాజుగా ఉన్న చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడి హోదాలో పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఉండి గత ఎన్నికల్లో భీమవరంలో ఓడిపోతే.. అదే ఎన్నికల్లో ఆయన మరో సోదరుడు నాగబాబు నరసాపురం ఎంపీగా ఓడిపోవడంతో పాటు ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.మమేకం కాకపోవడంతోనే…ఇలా ముగ్గురు మెగా బ్రదర్స్‌కు సొంత జిల్లా వాసులు ఎన్నికల్లో ఓటమి రుచి ఏంటో చూపించారు. వీరు హీరోలుగా స్టార్లుగా ఎదిగినా సొంత ప్రాంతం కోసం ఏం చేశారన్న ప్రశ్నలు రైజ్ అవ్వడం… అందుకు వీరి నుంచి సరైన ఆన్సర్లు లేకపోవడం కూడా ఈ మెగా సోదరులను సొంత ప్రాంత వాసులు రాజకీయంగా ఆదరించకపోవడానికి కారణంగా చెప్పాలి.
2009లో పాలకొల్లులో చిరు ఓటమి తర్వాత అయినా పవన్ కళ్యాణ్ అన్న ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి మధ్య ఐదేళ్ల టైం ఉన్నా కూడా పవన్ సొంత ప్రాంత ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే ఆయన్ను కూడా ఓడించారు.గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మరో స్థానం గాజువాకలో మూడో స్థానంలో ఉంటే భీమవరంలో రెండో స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం కాపు యువతతో పాటు క్షత్రియ వర్గంలో కూడా కొందరు పవన్‌కు లోపాయికారిగా అసెంబ్లీ ఓటు వరకు సహకరించారు. అదే ఇక్కడ పవన్‌కు ప్లస్ అయ్యింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకే ఒకసారి కార్యకర్తల సమావేశం పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భీమవరం గురించి ఆలోచించడమే మానేశారు. పూర్తిగా సినిమాల్లో మునిగిపోయి ఏపీలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనే పవన్‌కు లేదన్నది నిజం అనుకుంటే.. చివరకు సొంత ప్రాంతం.. సొంత నియోజకవర్గంలో అయినా వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలబడాలని.. పరువు నిలుపుకోవాలన్న భావనే పవన్ కళ్యాణ్ కు లేదనిపిస్తోంది.పైగా గత ఎన్నికల్లో పవన్‌పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాపు వర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. అదే జరిగితే గ్రంధి ఇక్కడ మరింత స్ట్రాంగ్ అవుతారు.
పోనీ బీజేపీతో పొత్తుతో అయినా కనీసం పవన్ కళ్యాణ్ గట్టెక్కుతాడన్న ఆశ అయినా ఉందా ? అని చూస్తే… భీమవరంలో బీజేపీ బలం జీరో. ఆ పార్టీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క కౌన్సెలర్ సీటు కూగా గెలిచే సీన్ లేదు. ఈ ప్రాంతంలో జనసేనకే బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకు 2.50 లక్షల ఓట్లు రాగా, భీమవరం, నరసాపురంలో జనసేన అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నారు. ఇదే పార్లమెంటు పరిధిలో తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులకు భారీగా ఓట్లు రావడంతో పాటు పరోక్షంగా టీడీపీ ఓటమికి కారణమయ్యారు.ప్రధాన పార్టీల గెలుపు ఓటములను శాసించే సత్తా ఉండి కూడా ఇక్కడ జనసేన పుంజుకోకపోవడానికి పవన్ కళ్యాణ్ వైఖరే కారణం. చివరగా చెప్పేదేంటంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే వచ్చే ఎన్నికల నాటికి జనసేన – టీడీపీ పొత్తు కుదిరి పవన్ భీమవరం బరిలో ఉంటే ఆ ఒక్క ఈక్వేషన్ తప్పా పవన్ ఎమ్మెల్యేగా గెలిచే స్కోప్ భీమవరంలో ఎంత మాత్రం లేదన్నది ఓపెన్ సీక్రెట్. అంతకు మించి పవన్ భీమవరంలో చేసే కొత్త రాజకీయం ఏం ఉండదన్నది నిజం.
ఆయుర్వేదం తో కరోనా ని జయించవచ్చు : అల్లు శిరీష్
Tags: Mega Brothers scene in own districts … growing