మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

రాయచోటి ముచ్చట్లు:

 

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ మానవత ఆధ్వర్యంలో ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో లక్కీరెడ్డిపల్లె నలాంద స్కూల్ నందు సుమారుగా 210 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది, అందులో 40 మందికి శస్త్ర చికిత్స అందిస్తున్నారు. రాయచోటి మీదుగా ఈ మధ్యాహ్నం బయలుదేరి సోమవారం మధ్యాహ్నం కి శస్త్ర చికిత్సను గావించి తదుపరి వారికి అవసరమైనటువంటి అద్దాలను అందించి తర్వాత తిరిగి వారిని రాయచోటికి చేర్చడం జరుగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ శివారెడ్డి తెలియజేశారు.అనంతరం లయన్ శివా రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మండల వారీగా నిర్వహిస్తామని అంధత్వ నివారణని ముఖ్య ఉద్దేశంగా చేపడతామని తద్వారా మారుమూల ప్రజలకు ఈ అవకాశాన్ని అందిస్తామని తెలియజేశారు.అనంతరం జోన్ చైర్మన్ లయన్ మహమ్మద్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగపరచుకోవాలని పేద ప్రజలందరికీ ఈ అవకాశం కల్పిస్తామని మరెన్నో కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేశారు.అనంతరం మాజీ అధ్యక్షులు లయన్ చాన్ బాషా మాట్లాడుతూ అందత్వ నివారణ అర్థం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పడిందని అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలియజేశారు .గతంలో కూడా ఎన్నో శస్త్ర చికిత్సలు నిర్వహించారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లయన్ రామ్మోహన్ లయన్ పవన్ లయన్ వెంకటరామిరెడ్డి నూకల రవీంద్ర అలాగే ఎస్వి కంటి ఆసుపత్రి గౌరి శంకర్ డాక్టర్లు గాయత్రి, చైతన్య ,సిబ్బంది పాల్గొనడం జరిగింది.

 

Tags: Mega free eye medical camp

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *