Natyam ad

బిల్లేరులో మెగా వైద్య శిభిరం

–జ్వరపీడితులను పరామర్శించిన డిఅండ్‌ఎంహెచ్‌ఓ ప్రభావతి
–ఐదు రోజులు మెగా వైద్య శిబిరంఏర్పాటు
— రక్తనమూనాలు సేకరణ
— వైద్య సిబ్బంది సేవలపై ఆగ్రహం

చౌడేపల్లె ముచ్చట్లు:


మండలంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ బిల్లేరు గ్రామంలో వారం రోజులుగా జ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనపై   ఈనెల 29న బిల్లేరులో ప్రభలిన జ్వరాలు క థనం ప్రచురితమైంది. స్పందించిన డిఅండ్‌ఎంహెచ్‌ఓ ప్రభావతి బ్యుధవారం తనిఖీ చేశారు. ఎంపీపీ రామమూర్తి, తో కలిసి బిల్లేరులో జ్వరాలతో మంచంపట్టిన రోగులను గుర్తించి వైద్య పరీక్షలు చేశారు. జ్వర భాధితులనుంచి రక్త నమూనాలు సేకరించారు. అసలు ప్రజలకు సోకిన జ్వరాల సంగతేంటి..? ఎలా వ్యాపించినది…? కారణాలేంటి అనే అంశాలపై అధికారుల బృందం ఆరా తీసింది. గ్రామంలో పారిశుధ్య లోపంతోపాటు ఎటు చూసినా చెట్లు నివాసప్రాంతాల్లో ఏపుగా పెరిగాయని తద్వరా దోమల బెడద తీవ్రంగా ఉందని అధికారులకు ప్రజలు విన్నవించారు. గ్రామం నడి బొడ్డున నీటినిల్వతో నిండిన బావి కారణంగా దోమలకు నిలయంగా మారిందని, నీటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చారు. దోమల లార్వా నివారణకు అభైట్‌ ద్రావణంను పిచికారి చేశారు. తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేశారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. జ్వరాల విషయం తెలిసినప్పటికీ ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త సకాలంలో స్పందించలేదని్య ధికారుల దృష్టికి ప్రజలు తీసుకురావడంతో వైద్య సిబ్బందిపై డిఅండ్‌ఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులపాటు గ్రామంలో మెగా వైద్య శిభిరంను ఏర్పాటుచేసి రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకొన్నట్లు ఆమె తెలిపారు.రక్త న మూనాలు ల్యాబ్‌కు పంపి నివేదికలను వెల్లడిస్తామన్నారు. వ్యాధి లను బట్టి మెరుగైన చికిత్సలందిస్తామని చెప్పారు.ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.దోమకాటుల భారీనుంచి ఆరోగ్యాలను రక్షించుకోవాలని దోమ తెరలను వాడాలన్నారు. శుక్రవారం డ్రై డేను పాటించాలని అవగాహన కల్పించారు.

Post Midle

ప్రవేటు ఆసుపత్రులకు వెళ్ళొద్దు…..
ప్రజలు జ్వరాలతో పాటు అనారోగ్యానికి గురైతే ప్రవేటు ఆసుపత్రులకు వెళ్ళాల్సీన అవసరంలేదని, ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ప్రభావతి తెలిపారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో వైద్యులు సక్రమంగా ఉండడంలేదని, స్టాప్‌ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆమె దృష్టికి తెచ్చారు. ఇలాంటి సంఘటనలు మరోమారు పునావృత్తం కాకుండా చర్యలు తీసుకొంటామని మీడియాకు వివరించారు. ప్రవేటు ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్‌లు సూదులు, సెలైన్‌ లు పెడుతూ రోగుల వద్ద దొరికినంతా దోచేస్తున్నారని వీటిని తనిఖీలు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఆమె వెంట జిల్లా మలేరియా్య ధికారి శ్రీనివాసులు, డాక్టర్‌లు పవన్‌కుమార్‌, ప్రవీణ్‌, నవీన్‌తేజ్‌ రాయల్‌,ఎంపీటీసీ శ్రీరాములు, ఉపసర్పంచ్‌ నారాయణ,నేతలు రెడ్డెప్పరెడ్డి, అమరనాథ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Mega Medical Camp in Billeru

 

Post Midle