గ‌ని`గా మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌.. ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Date:20/01/2021

హైదరాబాద్‌ ముచ్చట్లు:

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు నేడు(జ‌న‌వ‌రి 19). ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా చేస్తోన్న చిత్రానికి `గ‌ని` అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు అని చెప్పేలా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బాక్స‌ర్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ లుక్ టెరిఫిక్ అంటూ ప్రేక్ష‌కాభిమానుల నుండి రెస్పాన్స్ వ‌స్తోంది. బాక్స‌ర్ పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌ ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకోవ‌డం విశేషం. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
నటీనటులు: వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags:Megaprince Varuntej as Gini .. First Look, Motion Poster Released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *