మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

నరసాపురం ముచ్చట్లు:


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం అంబేద్కర్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద అన్నదానం చేశారు. చాగంటి మురళి కృష్ణ ( చిన్న ) పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్  చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చాలా అందంగా ఉన్నారు మెగాస్టార్ అనేక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు ఈ రోజున ఫ్యాన్స్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు చిరంజీవి చూపిన మార్గంలో  అభిమానులందరూ నడుచుకోవడం కూడా మంచి పరిణామం అన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ ని సీఎంగా చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర నాయకులు చాగంటి మురళీకృష్ణ.నరసాపురం టౌన్ జనసేన అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు. మెగా ఫ్యాన్స్ నియోజకవర్గ ప్రెసిడెంట్ దివి సత్యన్. చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్. మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: Megastar Birthday Celebrations

Leave A Reply

Your email address will not be published.