మేకిన్ ఇండియాలో భాగంగానే రిలయన్స్ తో ఒప్పందం

Mekin India is a part of the deal with Reliance

Mekin India is a part of the deal with Reliance

కుండబద్దలు కొట్టిన డస్టల్
Date:17/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఏ ముహూర్తంలో కుదిరిందో గానీ, దాని గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఒకటి ప్రతిపక్షాలకు ఆయుధంలా దొరికితే, మరొకటి ప్రభుత్వాన్ని సమర్థించేలా ఉంటోంది. తాజాగా డసాల్ట్ సంస్థకు సంబంధించిన ఒక అంతర్గత డాక్యుమెంటు తమ చేతికి చిక్కిందంటూ ఫ్రెంచి విమానయాన రంగ వెబ్‌సైట్ ఒకటి చెప్పుకొచ్చింది. అసలు భారత దేశంలోని రిలయన్స్ డిఫెన్స్ సంస్థతో జాయింట్ వెంచర్ కంపెనీ ఎందుకు ఏర్పాటు చేయాల్సిందోనన్న విషయాన్ని ఫ్రెం చి కార్మిక సంఘాల సమాఖ్యకు డసాల్ట్ ఏవియేుషన్ సంస్థ వివరించినట్లుగా ఈ పత్రాల్లో ఉంది. భారతదేశంతో రక్షణ ఒప్పందం కుదరాలంటే తప్పనిసరిగా ‘వేుకిన్ ఇండియా’ అనే క్లాజుకు ఒప్పుకోవాలని, అందుకే అలా చేశామని డసాల్ట్ ఏవియేుషన్ సంస్థ కార్మిక సంఘాలకు తెలిపింది.
ఈ విషయాన్ని మాజీ వైమానిక దళ ఉద్యోగి, రక్షణ రంగ విషయాల రచయిత అయిన వైవెస్ పాగోట్ రాశారు. ఈ వివాదాస్పద పత్రాన్ని ఫ్రెంచి విమానయాన వెబ్‌సైట్ పోర్టైల్-ఏవియేుషన్ ప్రచురించింది. కథ మరో కొత్త మలుపు తిరిగేలా మరో పత్రాన్ని కూడా ఈ సైట్ ప్రచురించింది. మరో ఫ్రెంచి కార్మిక సంఘం కాన్ఫెడరేషన్ ఫ్రాన్సైస్ డెమొక్రాటిక్ డు ట్రావైల్ (సీఎఫ్‌డీటీ) వద్ద డసాల్ట్ సంస్థ చేసిన ప్రజెంటేషన్ గురించి ఈ పత్రం ఉంది. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా క్లాజును తప్పనిసరి చేసిందని, అందుకే తాము ఈ డీల్ కుదుర్చుకోవాలని రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని డసాల్ట్ సంస్థ సీఎఫ్‌డీటీ ప్రతినిధులకు చెప్పినట్లుగా అందులో ఉంది.
ఈ నివేదికను చూసి మీకు మీరే ఒక అభిప్రాయాన్ని రూపొందించుకోవాలని పగోట్ తన పోస్టులో రాశారు. రిలయన్స్ సంస్థను మాత్రమే భాగస్వామిగా ఎంచుకోవాలని భారత ప్రభుత్వం చెప్పినట్లుగా ఎక్కడా లేకపోవడం ఇందులో గమనార్హం. మేకిన్ ఇండియా మాత్రమే తప్పనిసరి అందని డసాల్ట్ సంస్థ కార్మిక సంఘాలకు చెప్పడం కూడా.. అక్కడ ఉత్పత్తి తగ్గి భారతదేశంలో చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నట్లుగా ఉంది. లేకపోతే కార్మిక సంఘాలతో చర్చించాల్సిన అవసరం డసాల్ట్ ఏవియేుషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు ఉండదు.
Tags:Mekin India is a part of the deal with Reliance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *