రెమెడియల్ శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఎంఈవో హేమలత

MEM Hemalata, who oversees the remedial training classes

MEM Hemalata, who oversees the remedial training classes

Date:05/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జరుగుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రెమెడియల్ శిక్షణ తరగతులను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి హేమలత  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుక బడిన విద్యార్థులను ఉత్తమ సామర్ధ్యాలు గల విద్యార్థులుగా మార్చడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని తెలపడం జరిగింది. తరగతి గదిలో తప్పని సరిగా ఈ విధానాన్ని అమలు పరచాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విషయ నిపుణులు హరిప్రసాద్, గురుప్రసాద్ ,సిఆర్పీ లు రమేష్ ,గంగాధర్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.  అలాగే మండల విద్యావనరుల కేంద్రంలోని నాన్ భవిత కేంద్రానికి ఆకులవారిపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ,రాయలపేట ప్రధానోపాధ్యాయుడు యుగంధర్, ప్రమీల దేవి,  విరాళంగా ఇచ్చిన వస్తు సామగ్రిని మండల విద్యాశాఖాధికారి హేమలత  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

 

కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగు

Tags:MEM Hemalata, who oversees the remedial training classes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed