Natyam ad

జాతీయస్థాయి సేవరత్న అవార్డులు అందుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్  సభ్యులు

వేములవాడ ముచ్చట్లు:


శ్రీ లంబోదర కల్చర్ అకాడమీ నేషనల్ లెవెల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆచార్యదేవోభవ పురస్కారం, నాట్యకల జ్యోతి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాదులోని తెలంగాణ సరస్వతి పరిషత్ హైదరాబాద్ లో ఆదివారం రోజున స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురికి ఈ పురస్కారాలు అందిస్తూ స్వచ్ఛంద కార్యక్రమంలో సేవలందిస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నిత్యం చేస్తున్న సేవలు గుర్తించి సభ్యులను ఇరువురికి సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆదివారం రోజున ఈ పురస్కారాన్ని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ అకాడమీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా చేతుల మీదుగా  గొంగళ్ళ రవికుమార్, మొహమ్మద్ అబ్దుల్ రఫీక్ లను జాతీయస్థాయి సేవరత్న  పురస్కారం అవార్డు ప్రధానచేసి ఘనంగా సన్మానించారు.ఈ జాతీయ స్థాయి సేవా రత్న అవార్డు అందుకున్న గొంగళ్ళ రవికుమార్, మొహమ్మద్ రఫీక్ లను మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ ,జువ్వాడి వెంకటేశ్వరరావు, నాగుల చంద్రశేఖర్, చల్ల సత్తయ్య, జూలపల్లి రాజు, బస్మాంగి బసవరాజ్, ప్రతాప నటరాజ్, పొలాస రాజేందర్ అభినందనలు తెలిపారు.

 

Tags: Members of My Vemulawada Charitable Trust who received national level Sevaratna awards

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.