Natyam ad

పుంగనూరు  సేవా కార్యక్రమాల్లో   NVR ట్రస్ట్ సభ్యులు

పుంగనూరు ముచ్చట్లు:

చదళ్ల  గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన దసరా నవరాత్రులు జరుపుకుని పది రోజులు గడవకముందే NVR ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాల లో నిమగ్నమయ్యారు.   ఎన్. వి. ఆర్. ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్. వేణుగోపాల్ రెడ్డి  చేతుల మీదుగా, పంజాని మండలం చదల వారి పల్లి లో నిర్మిస్తున్న అభయ ఆంజనేయ స్వామి గుడి కి 25000(25వేలరూపాయలు),పుంగనూరు మండలం చిన్న కొండచర్ల గ్రామం లో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి 20000(ఇరవై వేలు), పాలెంపల్లి గ్రామంలో మజీదు కాంపౌండ్ నిర్మాణానికీ 15000(పదహైదు వేలు), చౌడేపల్లి మండలం తిరుమణ పల్లి లో నిర్మిస్తున్న గంగమ్మ ఆలయానికి 10000(పది వేలు), లద్దిగం గ్రామంలో మైనారిటీ సోదరి సల్మా వివాహా కార్య క్రమానికి 10000(పది వేలు) అందజేయడం జరిగింది.  ఈ కార్య క్రమం లో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు , నరేంద్రరెడ్డి, జయపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి,సందీప్ రెడ్డి,  వెంకట రెడ్డి, మనోహర్ రెడ్డి, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Members of NVR Trust in Punganur service programs

Post Midle