రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ బ్రాహ్మణుల అభివృద్ధికి దోహదం చేస్తారు

Members of Rajya Sabha CM Ramesh will lead to the development of Brahmins

Members of Rajya Sabha CM Ramesh will lead to the development of Brahmins

– జ్వాలాపురం శ్రీకాంత, ప్రశాంత్‌ ఆకాంక్ష

Date:12/03/2018

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ కృషి చేస్తారని, ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లె తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు ప్రశాంత్‌ ఆకాంక్షించారు. విజయవాడలో సీఎం రమేష్‌ దంపతులకు సన్మానం చేసి, వేదపండితుల ఆశీర్వాదం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రమేష్‌ రాజ్యసభ సభ్యుడుగా రెండవసారి ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , మంత్రి నారా లోకేష్‌ల ఆధ్వర్యంలో బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం రమేష్‌ కృషి చేస్తారని తెలిపారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ సీఎం రమేష్‌ తనకు మంచి మిత్రులని ఆయన ఎన్ని ఉన్నత పదవులు పొందినా , స్నేహితానికి విలువఇచ్చే వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌ మాట్లాడుతూ రెండవ సారి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండ కృషి చేస్తామన్నారు.

Tags: Members of Rajya Sabha CM Ramesh will lead to the development of Brahmins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *