రాజధాని నిర్మాణాలను పరిశీలించిన ఆర్ధిక సంఘం సభ్యులు

Date:12/10/2018
అమరావతి  ముచ్చట్లు:
ఏపీలో పర్యటిస్తున్న 15వ ఆర్ధిక సంఘం సభ్యులు రాజధాని నిర్మాణం జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. అమరావతి  నిర్మాణంలో భాగంగా పరిపాలనా నగరంలో చేపట్టిన  నిర్మాణాలను సిఆర్డిఏ అధికారులు ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు వివరించారు. ఎమ్మెల్యేలు., ఎమ్మెల్సీల నివాస సముదాయాలు.,  అఖిల భారత స్థాయి సర్వీస్ అధికారుల క్వార్టర్లు., శాశ్వత సచివాలయం., హైకోర్టు ప్రాంగణాలను కమిటీ సభ్యులు సందర్శించారు.  వేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీని సిఆర్డిఏ కమిషనర్ శ్రీధర్ వివరించారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తోన్న ఇళ్లలో పూర్తైన బ్లాకుల్ని దగ్గరుండి చూపించారు.  ఇప్పటికే కొన్ని  బ్లాకుల్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటం పట్ల ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.
మార్చి నాటికి  ఆలిండియా సర్వీస్ అధికారులు.,  గజిటెడ్ అధికారులు., సచివాలయ ఉద్యోగుల కోసం ఇళ్లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆర్ధిక సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని సిఆర్డిఏ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే 40వేల కోట్ల రుపాయల విలువైన పనులు అమరావతిలో జరుగుతున్నందున వేగంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రత్యేక సాయం ప్రకటించాలని కోరారు. రాజధానిలో పర్యటన తర్వాత అమరావతి నిర్మాణంపై   ఆర్ధిక సంఘానికి  పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు సీఆర్డీఏ అధికారులు.
Tags:Members of the financial community examining capital structures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *