Natyam ad

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. మహిళల రుతుక్రమంలో మార్పులు

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
 
ఇలాంటివేళ..కరోనాకు చెక్ పెట్టేందుకు అందుబాటులోకి వచ్చిన టీకాలకు సంబంధించిన కొత్త సందేహాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే టీకాలు వేసుకుంటే.. పురుషులకు ఏదేదోఅవుతుందని.. వారి ‘శక్తి’ మీద ప్రభావం చూపిస్తుందన్న చెత్త వాదన రావటం.. దానికి ఎలాంటి శాస్త్రీయత లేదన్నది తేలటం తెలిసిందే.ఇది సరిపోదన్నట్లుగా.. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునే మహిళల ఆరోగ్యానికి కీలకమైన రుతుక్రమం మీద ప్రభావం చూపిస్తుందన్న కొత్త సందేహం బయటకురావటం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక అధ్యయనం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. మహిళల రుతుక్రమంలో స్వల్ప.. తాత్కాలిక మార్పులు మాత్రమే కలుగుతాయని వెల్లడైంది. అది కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే సాధారణ స్థితికి వస్తుందని తేల్చారు.దీనికి సంబంధించిన ఒక అధ్యయనాన్ని నాలుగు వేల మంది మహిళల మీద నిర్వహించారు. ఈ అధ్యయనం కోసం అమెరికాలో ఎఫ్ డీఏ అనుమతి పొందిన బర్త్ కంట్రోల్ యాప్ సమాచారాన్ని విశ్లేషించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపు ఆరు నెలసరి సమయాల్లో వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. దీని ప్రకారం తేలిందేమంటే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే నెలలో ఒక రోజు ఆలస్యంగా రుతుక్రమం వచ్చినట్లుగా గుర్తించారు.
 
 
అయితే.. రుతుస్రావం విషయంలో ఎలాంటి తేడా లేదని గుర్తించారు.సహజ సిద్ధంగా ఎన్ని రోజులకు ఒకసారి రుతుక్రమం వస్తుందో.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా అంతేలా వస్తుందని.. ఎలాంటి మార్పులు రావటం లేదని గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్న మహిళలతో వ్యాక్సిన తీసుకోని మహిళల్ని పోల్చి చూశారు. రెండు డోసులు తీసుకున్న 538 మంది మహిళల్లోనే సాధారణం కంటే రెండురోజులు ఆలస్యంగా పీరియడ్స్ వస్తాయని గుర్తించారు. వారిలో 10 శాతం మందిలో 8 రోజులు ఆలస్యంగా గుర్తించారు. ఈ మార్పులు కొద్ది రోజుల వ్యవధిలోనే సాధారణ స్థాయికి వచ్చేసినట్లుగా గుర్తించారు. రుతుక్రమం మీద వ్యాక్సిన్ ప్రభావం స్వల్పం.. తాత్కాలికమేనని తాజాగా అధ్యయనంస్పష్టం చేసింది.ఇదంతా చదివిన తర్వాత ఇంకెలాంటి అనుమానాలు ఉండవని చెప్పక తప్పదు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Menstrual changes in women after taking the Kovid vaccine