Natyam ad

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు మానస ఎంపిక

చౌడేపల్లె ముచ్చట్లు:


రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు చౌడేపల్లె మండలం మర్రిమాకులపల్లె ఉన్నతపాఠశాల విద్యార్థిని మానస ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నాదముని ఆదివారం తెలిపారు. స్కూల్‌ గేమ్స్ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్వేటినగరంలో నిర్వహించి జిల్లా జట్టు పోటీల్లో మానస ప్రతిభ చూపి ఎంపికైందన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేట లో ఈనెల 14 నుంచి 16 వతేది వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలలో మాసన తలపడనుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణిను ఉపాధ్యాయ బృంధంతోపాటు ఫిజికల్‌ డైరక్టర్‌ పవన్‌కుమార్‌, సర్పంచ్‌ షంషీర్‌భాషా, సింగిల్‌విండో డైరక్టర్‌ రమేష్‌ బాబు, చిన్నప్ప తదితరులు అభినందించారు.

 

Tags; Mental selection for state level volleyball competitions

Post Midle
Post Midle