కిల్లోగుడ, డుంబ్రిగుడ లో అటకెక్కిన మెనూ – ఇక్కట్లకు గురి అవుతున్న విద్యార్థులు
-కొరవడిన అధికారుల పర్యవేక్షణ
అల్లూరి ముచ్చట్లు:
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి విద్య అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్య తో పాటు భోజనం మెనూ అటకెక్కుతోంది. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనుా సక్రమంగా అమలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వివరాలకు వెళితే డుంబ్రిగుడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, కిల్లోగుడ ఆంగ్ల మాధ్యమ బాలికల పాఠశాలలో భోజనం మెనూ అమలు కావడం లేదని గిరిజన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు . ఆయా పాఠశాలల్లో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రుల్లో అందిస్తున్న పోషకాహారం మెనూ ప్రకారం గా కల్పించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు . డుంబ్రిగుడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం కల్పించాల్సిన అల్పాహారం వాము రైస్ నాణ్యత లేదు.

Tags: Menu stuck in Killoguda, Dumbriguda – Students who are being targeted here
