స్కూల్లోనే మద్యం త్రాగిన ఎంఈవో

Date:23/02/2021

అదిలాబాద్ ముచ్చట్లు:

ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే నీఛ పనులకు పాల్పడుతున్నారు. విద్యాబుద్దులు చెప్పి విద్యార్థుల్ని దారిలో పెట్టాల్సిన వాళ్లే పక్కదారి పడుతున్నారు. అయితే ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే ఉన్నత బాధ్యతలు నిర్వర్తించే మండల విద్యాధికారే పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకున్నాడు. దేవాలయం లాంటి పాఠశాలలో పాడుపనులకు తెరలేపాడు. అంతేకాదు పూటుగా తాగి ఆ మత్తులోనే అతడు చిందులు కూడా వేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించాడు. అయితే అతడు మద్యం సేవించింది ఏ బార్‌లోనూ, తనఇంట్లోనే అయితే అసలు వార్తే అయ్యేది కాదు. చదువులు చెప్పే ఓ స్కూల్‌ ఆవరణలో ఆయన ఈ పనిచేశాడు. మద్యం మత్తులో డ్యాన్స్‌ కూడా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో ఎంఈవో, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌ చేస్తున్నారు. ఎంఈవో అధికారి తాగి చిందులేయడం దారుణం అంటూ వీడియోను చూసిన వారంతా మండిపడుతున్నారు. ఇది చాలా హేయమైన చర్య అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; MEO who drank alcohol at school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *