Natyam ad

రోడ్డు ప్రమాదంలో మెప్మా పిడీ భార్య మృతి

కడప ముచ్చట్లు:


కడప నగర శివారులోని పబ్బపురం హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ను లారీఢీకొన్నఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో కడప మెప్మా పిడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. విషయం తెలియగానే చింతకొమ్మదిన్నె, కడప తహశీల్దార్లు గంగయ్య, శివ రామిరెడ్డి, కడప డిఎస్పీ వెంకట శివారెడ్డి,  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారునుంచి బాధితులను బయటకు తీసారు. మెప్మా పీడీతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  పీడీ మెప్మా సతీమణి మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Mepma PD’s wife died in a road accident

Post Midle
Post Midle