చింతపండుకు జిఎస్టీ రద్దుపై వ్యాపారుల హర్షం

Merchandise on GST termination for tamarind

Merchandise on GST termination for tamarind

– ఎంపి మిధున్‌కు కృతజ్ఞతలు

Date:21/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం చింతపండుకు 5 శాతం జిఎస్టీని రద్దు చేయడంపై శనివారం చింతపండు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం వ్యాపారులు సమావేశమై రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఎంకెబి.ఇమ్రాన్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు చింతపండు వ్యాపారులను సీటీవో శ్రీనివాసులునాయుడు వేదించడం, తప్పుడు కేసులు బనాయించడంపై అప్పట్లో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించి వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే చింతపండు వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారని తెలిపారు. దీనిపై అధికారం రాగానే ఎంపి మిధున్‌రెడ్డి దృష్టి సారించి, జూలై 30న ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను పార్లమెంట్‌లో కలసి చింతపండుపై జిఎస్టీ రద్దు చేయాలని కోరారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చింతపండు వ్యాపారులను ఆదుకోవాలని కోరారన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 శాతం జిఎస్టీ రద్దు చేయడంతో చింతపండు వ్యాపారులు, రైతులకు ఎంతో భరోసా లభించిందని కొనియాడారు. రాష్ట్రంలో పుంగనూరు , నరసన్నపేట, తుని, విజయనగరం, సాలూరు, ధర్మవరం, కిర్లంపూడి, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, మదనపల్లె, కురబలకోట, పలమనేరు, హందూపురంతో సహా అనేక ప్రాంతాలలో చింతపండు వ్యాపారాన్ని సుమారు 30 వేల మంది నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కుటుంబాలకు మిధున్‌రెడ్డి అండగా నిలిచి ట్యాక్సులు లేకుండ చేయడం శుభపరిణామమన్నారు. ఇందు కోసం కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపి మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు కేక్‌ కట్‌ చేసి, బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు హాఫిజ్‌, కొండవీటి రెడ్డిప్రసాద్‌, చాంద్‌బాషా, ఖాదర్‌, ఎస్‌కెపి.ఖాజా, కిజర్‌ఖాన్‌, అమ్ము , అఫ్సర్‌, రహంతుల్లా, రఫిక్‌, రామలింగప్ప, జిఆర్‌.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఒటమి చెందిన శివప్రసాద్‌ను ఓదార్చుతూ….

Tags: Merchandise on GST termination for tamarind

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *