Merchants voluntary lockdown

వ్యాపారులు స్వచ్చంద లాక్‌డౌన్‌

– 30 నుంచి అమలు

Date:29/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పట్టణంలోని అన్ని రకాల వ్యాపారులు స్వచ్చందగా మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పట్టణ వర్తకవ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి , చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు బానుప్రకాష్‌ , కార్యదర్శి అర్షద్‌అలి ఆధ్వర్యంలో వ్యాపారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్షద్‌అలి మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా పట్టణంలో నాలుగు కేసులు మాత్రమే ఉండగా రెండు రోజుల్లో పది కేసులు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించి, మూసివేస్తామన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ఠ్యా చేస్తున్న స్వచ్చంధ లాక్‌డౌన్‌కు అధికారులు, పోలీసులు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే శానిటైజర్లు, మాస్క్ లు ధరించి , భౌతికదూరం పాటిస్తూ వ్యాపారాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు ఇనాయతుల్లా షరీఫ్‌, సుకుమార్‌, కి షోర్‌కుమార్‌, రవి, నాగరాజు, ఇమ్రాన్‌, హాఫిజ్‌, మహేంద్రబాబు, శ్రీనాథ్‌, కైలాస్‌, దినేష్‌, జయరాం, ప్రదీఫ్‌, సురేష్‌, వెంకటేష్‌, లియాఖత్‌, వినయ్‌, రాము, అఫ్సర్‌, గోపాల్‌, ఈశ్వర్‌, నయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు.

Tags: Merchants voluntary lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *