Merchants volunteer lockdown

వ్యాపారులు స్వచ్చంద లాక్‌డౌన్‌ హర్షనీయం

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:02/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పట్టణంలోని అన్ని రకాల వ్యాపారులు స్వచ్చందంగా ముందుకొచ్చి మధ్యాహ్నం 2 గంటల తరువాత లాక్‌డౌన్‌ చేపట్టడం హర్షనీయమని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం ఈ మేరకు పట్టణ వర్తకవ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి , చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు బానుప్రకాష్‌ కలసి కమిషనర్‌, సీఐ గంగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా పట్టణంలో నాలుగు కేసులు మాత్రమే ఉండగా మూడు రోజుల్లో కేసులు అధికంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించి, మూసివేస్తామని వ్యాపారులు రావడం శుభపరిణామమన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ఠ్యా చేస్తున్న స్వచ్చంధ లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని వర్మ పిలుపునిచ్చారు. అలాగే ప్రజలందరు శానిటైజర్లు, మాస్క్ లు ధరించి , భౌతికదూరం పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలన్నారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం‌

Tags: Merchants volunteer lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *