కరోనా విరామం అనంతరం మెట్రో పరుగులు

-ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైళ్ళు
-మూసాపేట స్టేషన్లో గోడలు, మెట్లపై పగుళ్ళు

Date:16/09/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైళ్ళు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కొన్నాళ్ళు నిలిచిపోయాయి. తిరగి మెట్రో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి. అయితే మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికుల్ని టెన్షన్ పెడుతున్నాయి. మూసాపేటలోని మెట్రో స్టేషన్ గోడలతో పాటు స్టేషన్పైకి వెళ్లే మెట్లపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పగుళ్లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే నిర్వహణ లేకపోవడం వల్ల ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అమీర్పేట మెట్రో స్టేషన్ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందడం విషాదం నింపింది. ఇలాంటి పగుళ్ళను పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు మెట్రో అధికారులను కోరుతున్నారు.

ప్రతిపక్షాల రాద్దాంతం

Tags: Metro runs after the corona break

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *