మిడ్ మానేర్ నిర్వాసితుల నిరసన

సిరిసిల్లా    ముచ్చట్లు:
రాజన్న సిరిసిల్ల జిల్లా  బోయినిపల్లి మండలం కొదురుపాక లో  మిడ్ మానేర్ నిర్వాసితులు, బిజేపి నాయకులు  నిరసనకు దిగారు.   మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలు, హామీలు తీర్చాకే బోయినిపల్లి రావాలని డిమాండ్ చేసారు. కుంటే కేటీఆర్ ను అడ్డుకుంటామని ప్రకటించారు. బుదవారం నాడు  బోయినిపల్లి మండలంలో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన కు మంత్రి కేటీఆర్ రానున్నారు.  సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు.  ఏళ్లుగా పోరాటం చేస్తున్నమే ఉన్నాం, కానీ సమస్యలు తీర్చలేదు.  ఆనాడు, సమైక్య రాష్ట్రం వేరే ప్రభుత్వం అన్నారు.. మారి తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఎందుకు నిర్వాసితులను పట్టించుకోవడం లేదు.  తమ ఇల్లు, చేను, చెలక అన్ని ప్రాజెక్టు కోసం త్యాగం చేసామని అన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలి. రాష్ట్రం చాలా ప్రాజెక్టు ల నిర్వాసితులకు డబ్బులు చెల్లించారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు చెల్లించరా అంటు ప్రశ్నించారు.  ప్రభుత్వం మిడ్ మానేర్ నిర్వాసితులకు డబ్బులు చెల్లిస్తే ఆర్థిక భారం అవుతుందని అంటున్నారు. కాని మానేర్ ప్రాజెక్ట్ ఇసుక ద్వారానే ప్రభుత్వానికి రూ.150 కోట్లు వచ్చాయి. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఇళ్లతో నిర్వాసితుల హామీ నెరవేర్చవచ్చని అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Mid Manor residents protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *