Natyam ad

ముస్లింలకు అవకాశం ఇచ్చిన ఎంపీ అభ్యర్థి మిధున్‌

– 19న నామినేషన్‌ దాఖలు
– ముస్లింల హర్షం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎన్నడు లేని విధంగా ముస్లింలచే ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వడంపై ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అంజుమన్‌ కమిటి అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎస్‌.సలీం, జాఫర్‌, ఇబ్రహిం, సున్నిఅంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ ముస్లింలను గుర్తించి వారి చేతులు మీదుగా ఎంపీ నామినేషన్లు దాఖలు చేసేందుకు మిధున్‌రెడ్డి అవకాశం ఇవ్వడం సంతోషకరమన్నారు. నామినేషన్లను సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు రాయచోటికి వెళ్లి ఈనెల 19న దాఖలు చేసే అవకాశం ఇవ్వడం మైనార్టీల విజయమన్నారు.

 

 

అలాగే ప్రతిసారి పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ప్రతి సారి ముస్లింలకు కేటాయించి, గెలిపించడం మరువలేమన్నారు. అలాగే అనేక పదవుల్లో మైనార్టీలకు అవకాశం కల్పించారని కొనియాడారు. హాజ్‌యాత్రకు నిధులు కేటాయించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు తగిన గుర్తింపు ఇచ్చి డిప్యూటి సీఎం పోస్టును ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే సున్నిఅంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌ మాట్లాడుతూ ముస్లింలకు అండగా ఉన్న వైఎస్సార్‌సీపీకి ముస్లింలు అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉమ్మడి పార్టీ అజెండాతో వస్తున్న అభ్యర్థులను ముస్లింలు నమ్మరాదన్నారు. మతతత్వ పార్టీలతో ముస్లింలు మనుగడ కోల్పోతారని తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తు పై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అఖండ విజయంతో గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు షా, అజీజ్‌సాహెబ్‌, ఎంఏఎన్‌ నూరుల్లా, బిటిఅతావుల్లా, ఎస్‌కెపి.ఖాజా, అయూబ్‌ఖాన్‌, కరీముల్లా, అలీమ్‌, బిజిరఫి, మన్సూర్‌, ఇర్ఫాన్‌, ఖాదర్‌, షామీర్‌, అఫ్సర్‌, అహమ్మద్‌, మునీర్‌, అస్మత్‌, మున్వర్‌, అజ్మత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Midhun is the MP candidate who gave opportunity to Muslims

Post Midle